బ్యాంకాక్ లో స్టెప్పులేస్తున్న బాద్షా
దూకుడు హిట్ తో దూకుడు మీదున్న శ్రీను వైట్ల యన్టీఆర్ బాద్షా లో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ యూనిట్ బ్యాంకాక్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలు , పాటలు తో సెప్టెంబర్ 25 వరకు ఈ భారీ షెడ్యుల్ పూర్తి చేయనున్నారు. బృందావనం నుంచి యన్టీఆర్ ఫ్యామిలి ఆడియన్స్ ని టార్గెట్ చేసాడు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు శ్రీను వైట్ల మార్క్ కామెడి తోడవటంతో ఇటు మాస్ ని, అటు క్లాస్ ని అలరించడానికి భాద్షా సిద్దమైయ్యాడు.
గబ్బర్ సింగ్ ఇచ్చిన భారీ హిట్ ఆనందంతో బండ్ల గణేష్ సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కావటంలేదు. బిజినెస్ మాన్ హిట్ తో ఊపు మీదున్న కాజల్ యన్టీఆర్ తో జతకట్టనుంది . ఈ హిట్ కాంబినేషన్ లో బాద్షా భారీ హిట్ కాయమని యన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
loading…
బ్యాంకాక్ లో స్టెప్పులేస్తున్న బాద్షా ,



